బిలియన్ డాలర్ల రిఫండ్‌కు ఓకే
- భారత్ ఆస్తులపై కేసుల్ని ఉపసంహరించుకుంటాం: కెయిర్న్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టాన్ని రద్దుపర్చిన నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ఆఫర్ చేసిన 1 బిలియన్ డాలర్ల (రూ.7,330 కోట్లు) రిఫండ్ ఆఫర్ తమకు ఆమోదయోగ్యమేనని యూకేకు చెందిన ఇంధన కంపెనీ ఎయిర్న్ ఎనర్జీ తెలిపింది. రిఫండ్ మొత్తం అందిన ఒకటి, రెండు రోజుల్లోగా వివిధ దేశాల్లో భారత్ ఆస్తుల జప్తునకు తాము వేసిన కేసుల్ని ఉపసంహరించుకుంటామని మంగళవారం కెయిర్న్ సీఈవో సైమన్ థామ్సన్ చెప్పారు. పారిస్‌లోని రాయబార భవనాల్ని, అమెరికాలో ఎయిర్ ఇండియాకు చెందిన భవనాలు, విమానాల్ని స్వాధీనపర్చుకునేందుకు ఆయా దేశాల్లో కెయిర్న్ కేసుల్ని దాఖలు చేసింది. రిఫండ్ ఆఫర్‌కు కెయిర్న్ ప్రధాన షేర్‌హోల్డర్లయిన బ్లాక్‌రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లు ఆమోదం తెలిపినట్లు థామ్సన్ వెల్లడించారు. పాత లావాదేవీలకు తాజాగా పన్ను విధించేందుకు వీలుకల్పించే రెట్రో పన్ను చట్టాన్ని ఇటీవల కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద షేర్ల విక్రయం ద్వారా గతంలో కెయిర్న్ నుంచి ప్రభుత్వం రూ.7,900 కోట్లు వసూలుచేసుకుంది. ఈ వివాదంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో అనుకూల ఆవార్డును పొందిన కెయిర్న్ వివిధ దేశాల్లో భారత్ ఆస్తుల స్వాధీనానికి కేసుల్ని వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cairn
- cairn india logo
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

