బోయింగ్‌కు ఆజాద్ కీలక విడిభాగాలు
విమానాల కీలక విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్... బోయింగ్‌కు విజయవంతంగా సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేసింది. జూలై 2021లో బోయింగ్ నుంచి కీలక విడిభాగాల సరఫరాకు సంబంధించిన ఆర్డర్ పొందిన ఆజాద్..ఏడాది కంటే ముందుగానే సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది.
- సరఫరా చేసిన హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, మార్చి 16: విమానాల కీలక విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్… బోయింగ్‌కు విజయవంతంగా సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేసింది. జూలై 2021లో బోయింగ్ నుంచి కీలక విడిభాగాల సరఫరాకు సంబంధించిన ఆర్డర్ పొందిన ఆజాద్..ఏడాది కంటే ముందుగానే సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. అనుకున్న సమయానికంటే ముందు సరఫరా చేసింది.
‘ఆజాద్ బృందానికి అభినందనలు. భారతదేశం పట్ల బోయింగ్‌కు ఉన్న నిబద్ధతకు ఈ ఆర్డర్ నిదర్శనం. ఆజాద్‌తో సుదీర్ఘమైన, విజయవంతమైన భాగస్వామ్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం’
– అశ్వనీ భార్గవ, బోయింగ్ ఇండియా ఎండీ
‘బోయింగ్ సంస్థకు మేము కట్టుబడిన సమయానికి విడిభాగాలు అందించినందుకు గర్వంగా ఉన్నది. హైదరాబాద్ యూనిట్లో తయారుచేసిన విడిభాగాలు ఇప్పుడు బోయింగ్ విమానాలన్నింటిలోనూ ఉపయోగించనుండటం ఇది తెలంగాణకు గర్వకారణం. తయారీ ప్లాంట్‌ను జాగ్రత్తగా, అత్యంత కఠినమైన అనుమతుల మధ్య విడిభాగాలు తయారు చేసి సరైన సమయానికి డెలివరీ చేయడం అంత సులభం కాదు. మొదటి షిప్మెంట్ డెలివరీ సకాలంలో వెళ్లడం మా భాగస్వాములు సంస్థపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం’
– రాకేశ్ చోప్దార్,ఆజాద్ ఇంజినీరింగ్ వ్యవస్థాపకుడు, ఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Azad Engineering
- Boeing
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

