Apple | యునైటెడ్ మాంచెస్టర్ క్లబ్ కొనుగోలుపై యాపిల్ ఆసక్తి.. ఎంత మొత్తానికో తెలుసా..?
దాదాపు 700 కోట్ల డాలర్లకు యునైటెడ్ క్లబ్‌ని సొంతం చేసుకునే ఆలోచనలో యాపిల్
Apple : లండన్‌కు చెందిన యునైటెడ్ మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌ను అమ్మకానికి పెడుతున్నట్టు ఈ వారంలోనే ప్రకటన వెలువడింది. దాంతో, పెద్ద పెద్ద కంపెనీలు ఈ క్లబ్‌ను హస్తగతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా ఈ పోటీలో యాపిల్ కంపెనీ పేరు వినిపిస్తోంది. దాదాపు 700 కోట్ల డాలర్లకు యునైటెడ్ క్లబ్‌ని సొంతం చేసుకునేందుకు యాపిల్ కంపెనీ ఆసక్తి చూపిస్తోందట. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన ది డెయిలీ స్టార్ అనే వార్తాపత్రిక తెలిపింది.
యాపిల్ కంపెనీ ఒక ఫుట్‌బాల్ జట్టుని కొనుగోలు చేసేందుకు సిద్ధపడడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే పెద్ద ఫుట్‌బాల్ క్లబ్ అయిన యునైటెడ్ మాంచెస్టర్ యునైటెడ్‌ను చేజిక్కించుకుంటే ప్రకటనలు, స్పానర్స్‌షిప్ ద్వారా బోలెడంత ఆదాయం సమకూర్చుకోవచ్చు అనే ఆలోచనతో యాపిల్ రేసులోకి వచ్చిందని టాక్. యాపిల్ సీఈవో టిమ్ కుక్ బ్యాంకులతో మాట్లాడున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతేకాదు కుక్ కొత్తగా స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాడట.
గతంలో ఐర్లాండ్‌కు చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ నిపుణులు కొనర్ మెక్ గ్రెగర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఈ క్లబ్‌ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అయితే, ఈ క్లబ్‌ను కొన్నవాళ్లకు ఎదురయ్యే మొదటి సమస్య… ఓల్డ్ ట్రఫోల్డ్ స్టేడియం. పాతబడ్డ ఈ స్టేడియానికి కొత్త హంగులు తేవడానికి దాదాపు 100 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పోర్చుగల్ స్టార్ ఆటగాడ్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తోనే కొనసాగుతున్నాడు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

