Apple | యాపిల్ కొత్త ఫీచర్..‘ఐ మెసేజ్ కాంటాక్ట్ కీ వెరిఫికేషన్స్’.. ఐ క్లౌడ్ సెక్యూరిటీ మరింత స్ట్రాంగ్
ఎండ్-టు-ఎండ్ ఎన్స్క్రిప్షన్ ద్వారా భద్రత ఉండే డేటా కేటగిరీల సంఖ్య 14 నుంచి 23కు పెంపు
Apple : యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్. త్వరలోనే మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఐ క్లౌడ్‌లో దాచుకున్న సమాచార భద్రత కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్స్క్రిప్షన్ సౌకర్యాన్ని తీసుకు వస్తున్నట్టు యాపిల్ బుధవారం వెల్లడించింది. ‘ఐ మెసేజ్ కాంటాక్ట్ కీ వెరిఫికేషన్స్’ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇది ఎలా పని చేస్తుందంటే..? హ్యాకర్లు రహస్య మెసేజ్‌లను చూసేందుకు ప్రయత్నిస్తే వెంటనే యూజర్లను ఈ ఫీచర్ అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఫీచర్ యూజర్ల అకౌంట్లో డీఫాల్ట్‌గా ఉంటుంది. దీనివల్ల ఇకనుంచి ఐ క్లౌడ్‌లోని బ్యాకప్, ఫొటోలు, ఇతర సమాచారానికి ఢోకా ఉండదు.
అంతేకాదు ఎండ్-టు-ఎండ్ ఎన్స్క్రిప్షన్ ద్వారా భద్రత ఉండే డేటా కేటగిరీల సంఖ్యను 14 నుంచి 23కు పెంచింది. ఈ లిస్టులో బ్యాకప్స్, ఫొటోలు, నోట్స్, ఐ క్లౌడ్ డ్రైవ్, సఫారీ బుక్‌మార్క్స్, సిరి షార్ట్‌కట్స్, వాయిస్ మెమోస్, వాలెట్ పాస్స్ వంటివి ఉన్నాయి. అయితే.. ఐ క్లౌడ్ మెయిల్, కాంటాక్ట్స్, క్యాలెండర్ వంటివి ఈ జాబితాలో లేవు. అలానే ఫిజికల్ సెక్యూరిటీ కీ ద్వారా యాపిల్ ఐడీలోకి లాగిన్ అయ్యేందుకు యూజర్లను త్వరలోనే అనుమతించనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

