Amazon Great Indian Festival Sale | ఈ తేదీ నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ .. ఇవీ డిటైల్స్.. !
Amazon Great Indian Festival Sale | ఫ్లిప్ కార్ట్ తోపాటు అమెజాన్ సైతం తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీ ప్రకటించింది. అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయని గురువారం ప్రకటించింది.
Amazon Great Indian Festival Sale | పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ఈ కామర్స్ వేదికలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ రంగంలోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival 2023).. అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. తన ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెజాన్ తన ఆఫర్లు ప్రారంభమయ్యే తేదీలు ప్రకటించడం ఆసక్తికర పరిణామం.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఒక రోజు ముందు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఒక రోజు ఫ్రీ డెలివరీ వంటి వసతి కల్పిస్తున్నది. తొలిసారి ఆర్డర్ చేసే వారికి వెల్కం రివార్డు అందిస్తున్నట్లు తెలిపింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా ఒక పేజీ నిర్వహిస్తున్నది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ హోం అప్లియెన్సెస్‌పై డిస్కౌంట్లు అందిస్తామని వెల్లడించింది. సేల్ ప్రారంభం కావడానికి ముందే ఫోన్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. శాంసంగ్ ఎం04, శాంసంగ్ ఎం13, రియల్మీ నార్జో55, రెడ్మీ నోట్ 12 తదితర ఫోన్లపై ఆఫర్లు ఇస్తున్నది.
ఆపిల్ – ఐఫోన్లు, వన్ ప్లస్, ఐక్యూ, రియల్ మీ, శాంసంగ్ తదితర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వీటిపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందన్న వివరాలు త్వరలో ప్రకటించనున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, వన్ ప్లస్ 11 ఆర్, ఐఫోన్ 13, ఐక్యూ నియో 7 ప్రో, మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా, రియల్ మీ నార్జో 60 ప్రో, ఐక్యూ జడ్ 7 ప్రో, హానర్ 90 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఇంకా శాంసంగ్ ఎం34, వన్ ప్లస్ నార్డ్ సీఈ3, రియల్ మీ 60 5జీ వంటి మిడ్ రేంజ్ ఫోన్లపైనా ఆఫర్లు ఇవ్వనున్నది. ఇంకా అమెజాన్ అలెక్సా డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, అలెక్సా స్మార్ట్ హోం డివైజ్ లపై డిస్కౌంట్లు ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

