JD Lakshminarayana | కొత్త పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ.. పార్టీ స్థాపన వెనుక రీజన్ ఇదేనంట!
JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని, దానిని తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
JD Lakshminarayana | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్’ పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని, దానిని తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానని, అన్నివర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నట్టు వివరించారు. రాజకీయాలు అంటే మోసం కాదని, సుపరిపాలన అని పేర్కొన్నారు. ‘వీళ్లు తిన్నారని వాళ్లు.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించాను.. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

