స‌మ్మోహ‌న రూపా.. శ్రీ నార‌సింహా !

స‌మ్మోహ‌న రూపా.. శ్రీ నార‌సింహా !

హరి అవతారమైన నరసింహుడికీ అలంకారాలంటే ఇష్టమే! బ్రహ్మోత్సవ వేళ పరంధాముడు రకరకాల అలంకారాల్లో మనోహరంగా దర్శనమిస్తాడు.

మర్రి ఆకుపై పవళించిన విష్ణుమూర్తి వటపత్రశాయి. జగత్‌ రక్షకుడిగా ఆవిర్భవించిన యాదాద్రీశుడు శేషసాయి రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు.

జగదానంద కారకుడు జగన్మోహిని రూపం కట్టడమే.. దుష్టుల ఆటలు కట్టించడం కోసం, ఇష్టులను కనిపెట్టుకొని కరుణించడం కోసం.

ఉగ్రరూపంతో ఆవిర్భవించినా.. ప్రహ్లాదుడిపై ప్రేమతో కరుణమూర్తిగా మారిపోయాడు స్వామి. సరళమూర్తిని మురళీకృష్ణుడిగా అలంకరిస్తారు.

వేలిపై కొండను ఎత్తిన గోవర్ధనుడి అవతారంలో కొండంత వేలుపుగా పగలు దర్శనమిస్తాడు నరహరి. తన నీడలో ఉన్న భక్తులను అనుగ్రహిస్తాడు.

కోదండం పట్టుకొన్న రాముడిగా దర్జాగా దర్శనమిస్తాడు. కోటి దండాలు అందుకుంటాడు. అదే రోజు రాత్రి స్వామివారు గజ వాహనాన్ని అధిరోహిస్తాడు.

మహావిష్ణువు అలంకారంలో దివ్యవిమాన రథోత్సవంలో ఊరేగుతూ దర్శనమిస్తాడు యాదాద్రీశుడు. కొండకిందికి వచ్చి యాదాద్రి పురవీధుల్లో రథోత్సవం వైభవంగా కొనసాగుతుంది.

More stories

01

02

03

మగాళ్లు కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది