రాగి పాత్ర‌లో  నీటిని తాగొచ్చా?

రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులోని సూక్ష్మజీవులు నశిస్తాయి. సుమారు 8 గంటలు రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని కప, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది.

శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడడానికి ఇది సహకరిస్తుంది.

కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది.

వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు మంచిది.

గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది.

కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది.

రాగిపాత్రలోని నీరు క్యాన్సర్ ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.

ఆర్థరైటిస్ , కీళ్లనొప్పులు రాకుండా ఇది కాపాడుతుంది.