రాత్రిపూట త‌ల‌స్నానం చేస్తున్నారా?

#Hairfall Problems

రాత్రివేళ‌లో త‌ల‌స్నానం చేసి ప‌డుకుంటే త‌ల‌గ‌డ‌, బెడ్‌కు వెంట్రుక‌లు అంటుకుంటాయి. మామూలు జుట్టు కంటే త‌డి జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది.

చాలామంది త‌ల‌స్నానం త‌ర్వాత చిక్కులు తీయ‌రు. జుట్టు ఆర‌లేద‌ని అలాగే నిద్ర‌పోతారు. దీంతో ఉద‌యానిక‌ల్లా  ఉండ చుట్టుకుపోతుంది

జుట్టు సరిగా ఆరకుండా పడుకున్న సమయంలో.. మీరు నిద్రపోయే విధానం వేర్వేరు ఆకృతిలో ఉంటుంది. అలా ఉంటే మీ జుట్టు మరింత చిక్కుబడే అవకాశం ఉంది.

తేమతో అలాగే నిద్రపోవడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.

తడి జుట్టు తేమ కారణంగా వేగంగా ఫంగల్ పెరుగుదలకు కారణమవుతుంది.

రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల అలర్జీల వంటి సమస్యలు పెరగడమే కాక, తలనొప్పి, తల భారానికి కూడా కారణమవుతుంది. మైగ్రేన్, తలనొప్పి సమస్యలు కూడా తలెత్తుతాయి

రాత్రిపూట తలస్నానం చేశాక జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దువ్వుకొని జడ వేసుకోవాలి. ఆ తర్వాతే నిద్రించాలి. 

జుట్టు చిక్కుపడకుండా ఉండాలంటే మంచి కండీషనర్, హెయిర్ సీరంను వాడండి.