జుట్టు ఎక్కువ‌గా రాలిపోతున్న‌దా

TIPS

వయసుతో తేడా లేకుండా వేధిస్తున్న సమస్య జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం. ఈ సమస్యలకు అనేక షాంపూలు, మందులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికం మాత్రమే. సహజసిద్ధంగా లభించే పదార్థాలతో జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

తేనె తీసుకొని తడి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

పుల్లటి పెరుగులో తేనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.

కలబంద రసానికి, తేనె, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. 

ఇలా చేయడం వల్ల జుట్టుకి, మాడుకి కావలసిన తేమ అందుతుంది.

రోజ్‌వాటర్‌ను తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. దీంతోపాటు చుండ్రుకు కూడా చెక్ పెట్టవచ్చు