నార‌సింహుడు  యాద‌ర్షిని ఎన్ని రూపాల్లో అనుగ్ర‌హించాడు?

యాదర్షి తపస్సుకు మెచ్చిన స్వామి మొదట జ్వాలగా జ్యోతిర్మయ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అగ్నిగోళాల్లా మండుతున్న నేత్రాలతో మహోగ్ర రూపంతో జ్వాలా నరసింహుడిగా కొలువుదీరాడు.

మహోజ్వల జ్వాలా నరసింహుడిని దర్శించినా యాదర్షికి తృప్తి కలుగలేదు. స్వామి దర్శనం కోసం మళ్లీ తపస్సు ప్రారంభించాడు. యతి నిష్ఠకు మెచ్చిన నరకేసరి, యోగానందుడిగా ప్రత్యక్షమయ్యాడు.

అప్పటికీ తనివి తీరని యాదర్షి మళ్లీ తపస్సుకు పూనుకున్నాడు. ఈసారి స్వామి పక్షిరూపంలో, రెక్కలు ధరించి, సింహముఖంతో గండభేరుండ నరసింహుడిగా వెలిశాడు.

యాద‌ర్షి మ‌ళ్లీ త‌ప‌స్సు చేయ‌డంతో నరసింహుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చాడు. ‘ఇదే రూపంతో కొండపై నిల‌వ‌మ‌ని యాద‌ర్షి కోర‌గా.. లక్ష్మీనరసింహుడిగా కొలువుదీరాడు.

బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానంతో సేవించే భ‌క్తుల‌కు.. చిన్న చిన్న గ‌ర్జ‌న‌లు విన‌బ‌డుతూ ఉంటాయి. ఆ పర్వతమే సింహ గర్జనలు చేస్తుందని స్థల పురాణం. యాద ప‌ర్వ‌తాన్నే ఉగ్ర న‌ర‌సింహుడిగా భావిస్తారు.