Floral Pattern
Floral Pattern

దోమ‌లు కొంద‌రినే కుడ‌తాయెందుకు

Floral Pattern
Floral Pattern

దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచి వాటి చూపు బెటర్ అవుతుంది. సాయంత్రం, రాత్రి అయ్యేకొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి.

Floral Pattern
Floral Pattern

ఇంట్లోకి రాగానే దోమ‌లు డార్క్ కలర్ బట్టలు వేసుకున్నవాళ్లకు అట్రాక్ట్ అవుతాయి. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా కుడతాయి.

Floral Pattern
Floral Pattern

దోమలకు కార్బన్‌డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం. 160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్‌డై ఆక్సైడ్ వాసనను గుర్తుపట్టి మనుషుల దగ్గరకు వస్తాయి. 

Floral Pattern
Floral Pattern

లావుగా, అధిక బరువు ఉన్నవారు ఎక్కువ కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందుకని వారిని ఎక్కువగా దోమలు కుడతాయి.

Floral Pattern
Floral Pattern

గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందువల్ల అలాంటి వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి.

Floral Pattern
Floral Pattern

మన శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టం.

Floral Pattern
Floral Pattern

ఎవరైనా బాగా శ్రమించి, చెమటతో ఉంటే వారిని ఎక్కువగా ఆశ్రయించి కుడతాయి.

Floral Pattern
Floral Pattern

మన స్కిన్ ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవాలి. అందువల్ల చర్మంపై సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గిపోతుంది.

Floral Pattern
Floral Pattern

సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే చర్మంపై దోమలు ఎక్కువగా వాలతాయి.