బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన ప్రగ్యా జైస్వాల్‌

హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌కు ఆరోగ్య ప్రజ్ఞ ఎక్కువే. ఈ మధ్య మీడియాతో తన ఫిట్‌నెస్‌ రహస్యాలు పంచుకుంది. ఆ బ్యూటీ సీక్రెట్స్‌ ఆమె మాటల్లోనే..

pragya jaiswal

బాల్యం నుంచీ ఫిట్‌నెస్‌ అభిమానిని. నాన్న యోగాసనాలు వేసేవారు. మాతోనూ చిన్నచిన్న వ్యాయామాలు చేయించేవారు. 

ఇప్పటికీ నేను బరువులెత్తుతాను. పుషప్స్‌, స్కాట్స్‌ చేస్తాను. వారానికి 5 రోజులు.. రోజూ ఓ గంట వ్యాయామానికి కేటాయిస్తాను.

నా దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదు. కాబట్టే, రోజు విడిచి రోజు డ్యాన్స్‌ చేస్తాను. నిజానికి నేను ఏ డ్యాన్స్‌ స్కూల్లో చదువుకోలేదు. 

కానీ, నాట్యమంటే ముందు నుంచీ ఇష్టం. ఓ డ్యాన్స్‌ ట్రూప్‌ ద్వారానే సినిమాల్లోకి వచ్చాు. అందుకే నాట్యానికి ఎంతో రుణపడి ఉంటా.

ఇంటి భోజనం ఇష్టపడతాను. కానీ జంక్‌ఫుడ్‌ నచ్చదు. అలా అని కఠిన ఆహార నియమాలేం పాటించను. 

pragya jaiswal

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో కొంత బరువు పెరిగాను. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు. భారతీయ వంటకాలకు తిరుగులేదు. బయటి రుచులలో జపనీస్‌ ఇష్టం.

నా చర్మ సంరక్షణ గురించి చెప్పాలంటే.. రోజూ క్లెన్సింగ్‌ (ఏదైనా ద్రవంతో శుభ్రపరచడం) చేసుకుంటా.

క్లెన్సింగ్‌ తర్వాత టోనర్‌ అప్లై చేసి, మాయిశ్చరైజర్‌ రాసుకుంటాను. బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ వాడతా. నీళ్లు ఎక్కువగా తాగుతా.

క్లెన్సింగ్‌ తర్వాత టోనర్‌ అప్లై చేసి, మాయిశ్చరైజర్‌ రాసుకుంటాను. బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ వాడతా. నీళ్లు ఎక్కువగా తాగుతా.