వాళ్లతో అవసరమా?.. ట్రోల్స్‌పై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన శ్రుతి హాసన్‌

కమల్‌ హాసన్‌ వారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ మంచి ఇమేజ్‌ తెచ్చుకుంది శ్రుతి హాసన్‌.

White Lightning
White Lightning

స్టార్‌ కిడ్‌ అనే ఊబిలో పడకుండా తన టాలెంట్‌తో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ దక్కించుకుంది.

White Lightning

ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన శ్రుతి.. క్రాక్‌ సినిమాతో గ్రాండ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ఆ వెంటనే వకీల్‌ సాబ్‌తో సక్సెస్‌ అందుకుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి.

White Lightning

ఈ సందర్భంగా శ్రుతి హాసన్‌పై ట్రోల్స్‌ ఎక్కువయ్యాయి. తండ్రి వయసు ఉన్న నటులతో రొమాన్స్‌ చేయడం ఏంటని ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

అవకాశాలు లేకనా.. డబ్బుల కోసమా? అంటూ నిలదీస్తున్నారు. ఈ ట్రోలింగ్స్‌పై శ్రుతి హాసన్‌ అంతే ధీటుగా బదులిచ్చింది.

White Lightning
White Lightning

సినిమా రంగంలో వయసు అనేది జస్ట్‌ నంబరే అని.. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చని శ్రుతి హాసన్‌ పేర్కొంది.

గతంలో చాలామంది హీరోలు తమ వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించి ఇదే విషయాన్ని నిరూపించారని తెలిపింది.

ఎంతోమంది హీరోయిన్లు తమకంటే రెట్టింపు వయసు వాళ్లతో చేశారు.. నేను కూడా దానికి అతీతం కాదు అని శ్రుతి హాసన్‌ స్పష్టం చేసింది.