క్యూఆర్‌ కోడ్‌  స్కాన్‌ చేస్తున్నారా? 

Personal finance Tips

ఈరోజుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎక్కువయ్యాయి. ఏ లావాదేవీ జరిపినా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం డబ్బులు పంపించడం అలవాటైపోయింది.

ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఓఎల్‌ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను వీళ్లు ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారు.

OLXలో మనం పెట్టిన ప్రొడొక్ట్‌ కొంటామని నమ్మించి.. ఒక క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తారు. అది స్కాన్‌ చేస్తే మన ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది.

మరి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ మోసం బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

యూపీఐ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు.

డబ్బుల చెల్లింపులకే కానీ స్వీకరణకు క్యూఆర్‌ కోడ్‌ అవసరం ఉండదని గుర్తుంచుకోవాలి.

ఒక క్యూఆర్‌ కోడ్‌పై మరో క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ ఉంటే ట్రాన్సాక్షన్స్‌ చేయకపోవడం బెటర్‌.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన వెంటనే డబ్బులు పంపించకుండా వివరాలు సరిచూసుకోవాలి.

బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఓటీపీ ఎవరితో పంచుకోవద్దు