అయితే తాను ఈ స్థాయికి అంత సులువుగా రాలేదని.. ఎన్నో అవరోధాల్ని అధిగమించాల్సి వచ్చిందని చెబుతోంది మృణాల్ .
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కెరీర్ తొలినాళ్లలో తాను అనుభవించిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.
2018లో వచ్చిన లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.
ఈ పాత్ర రియలిస్టిక్‌గా వచ్చేందుకు రెండు వారాల పాటు కోల్‌కతాలోని వ్యభిచార గృహంలో గడిపానని మృణాల్ బయటపెట్టింది.
అక్కడి వాళ్లతో గడుపుతూ వారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని... వారి దుర్భర జీవితం చూసి చలించిపోయానని చెప్పింది.
ఆ సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిపోయానని.. సినిమా షూటింగ్ సమయంలో కూడా వాళ్ల దీనగాథలు గుర్తొచ్చి ఏడ్చేశానని తెలిపింది.
అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ తాబ్రేజి నూరాని ఇచ్చిన కౌన్సెలింగ్, ప్రోత్సాహంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డానని పేర్కొంది.