లిప్‌లాక్ సీన్‌లో న‌టించిన‌ప్పుడు నిద్ర ప‌ట్టేది కాదు

పుష్ప సినిమా స‌క్సెస్ త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది ర‌ష్మిక మంధ‌న‌.

Rashmika Mandanna

ఇప్ప‌టికే టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న ర‌ష్మిక‌.. పుష్ప త‌ర్వాత బాలీవుడ్‌లో కూడా వ‌రుస‌పెట్టి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది.

తాజాగా ర‌ష్మిక‌ న‌టించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్‌బై విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు.

గుడ్‌బై సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్‌లో బిజీగా గ‌డిపేస్తోంది ర‌ష్మిక‌.

ఈ సంద‌ర్భంగా డియ‌ర్ కామ్రెడ్ సినిమాలో విజ‌య్ దేవ‌రకొండ‌తో లిప్ లాక్‌, రొమాంటిక్ సీన్ల‌లో న‌టించిన‌ప్పుడు ఎదురైన విమ‌ర్శ‌ల గురించి చెప్పుకొచ్చింది.

ఆ స‌మ‌యంలో త‌ను ఎంత మ‌నోవేద‌న‌కు గురయ్యిందో త‌న బాధ‌ను వివ‌రించింది.

డియ‌ర్ కామ్రెడ్ సినిమాలోని లిప్‌లాక్ సీన్‌పైవ‌చ్చిన ట్రోల్స్‌ను ఎలా అధిగ‌మించానో నాకే తెలియ‌దు అంటూ చెప్పుకొచ్చింది.

ఆ రోజుల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనని చెబుతూనే.. తాను చాలా సెన్సెటివ్ ప‌ర్సన్ అని.. విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు త‌ట్టుకోలేక‌పోయేదాన్ని అని తెలిపింది.

ఆ స‌మ‌యంలో కొంద‌రు త‌న‌కు ఫోన్ చేసి అంతా స‌ర్దుకుంటుంద‌ని ధైర్యం చెప్పేవార‌ని పేర్కొంది.

అయితే కొంత‌మంది మాత్రం దారుణంగా విమ‌ర్శించేవార‌ని.. అవి త‌న‌ను  తీవ్రంగా బాధించాయ‌ని చెప్పింది.

అవేంత‌లా ఉండేవంటే.. రాత్రి ప‌డుకుంటే పీడ‌క‌ల‌లు వ‌చ్చేవ‌ని.. ఎవ‌రి కాల్లో ప‌ట్టుకుని బ‌తిమాలుతున్న‌ట్టుగా ఉండేద‌ని తెలిపింది.

అంద‌రూ త‌న‌ను వెలివేసిన‌ట్టుగా క‌ల‌లు వ‌చ్చేవ‌ని.. అప్పుడు ఉలిక్కిప‌డి నిద్ర లేచి ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది.

అలా రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని అంటూ ఆనాటి చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకుంది.