పెళ్లి సంద‌D బ్యూటీ శ్రీలీల త‌ల్లి కేసు

పెళ్లి సంద‌D హీరోయిన్ శ్రీలీల త‌ల్లి స్వ‌ర్ణ‌ల‌త‌పై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

White Lightning
White Lightning

సుభాక‌ర్ రావు అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న స్వ‌ర్ణ‌ల‌త‌.. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయింది.

White Lightning

కూతురు శ్రీలీల‌తో క‌లిసి 20 ఏళ్లుగా విడిగా జీవిస్తోంది. సుభాక‌ర్‌రావుతో విడాకుల కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కొన‌సాగుతోంది.

ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 3న కొర‌మంగ‌ళ‌లో ఉన్న త‌న అపార్ట్‌మెంట్‌లోకి స్వ‌ర్ణ‌ల‌త తాళం ప‌గుల‌గొట్టి వెళ్లింద‌ని సుభాక‌ర్ ఆరోపించారు.

White Lightning

ఈ విష‌యంలో స్వ‌ర్ణ‌ల‌త‌పై అడుగుడి పోలీస్ స్టేష‌న్‌లో సుభాక‌ర్‌రావు ఫిర్యాదు చేశారు.

శ్రీలీల త‌ల్లిపై కేసు న‌మోదు అయ్యింద‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

White Lightning
White Lightning

శ్రీలీల త‌ల్లి స్వ‌ర్ణ‌ల‌త ఇప్ప‌టికే ఒక కేసులో నిందితురాలిగా ఉంది.

అలియన్స్ యూనివ‌ర్సిటీ వివాదంలో అనేక‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో స్వ‌ర్ణ‌ల‌త‌పై కేసు న‌మోదైంది. ఇందులో స్వ‌ర్ణ‌ల‌త‌ను ఏ2గా పేర్కొన్నారు.

ఈ కేసులో ప్ర‌స్తుతం బెయిల్ మీద ఉన్న స్వ‌ర్ణ‌ల‌త‌పై తాజాగా మ‌రో కేసు న‌మోదైంది.

ప్ర‌స్తుతం శ్రీలీల ర‌వితేజ‌తో ధ‌మాకా, న‌వీన్ పోలిశెట్టితో అన‌గ‌న‌గా ఒక రాజు చిత్రాల్లో న‌టిస్తోంది.

అలాగే గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరీటీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టూడెంట్ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‌.