ఓటీటీలోకి ముందే వ‌చ్చేస్తున్న‌  రాధే శ్యామ్‌

ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌లై డివైడ్ టాక్ తెచ్చుకుంది.

Green Blob

రాధే శ్యామ్ సినిమా ఇప్పుడు అనుకున్న తేదీకంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్న‌ది.

ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది.

ఏప్రిల్ 11 త‌ర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌ని రాధేశ్యామ్ మేక‌ర్స్ డీల్ కుదిరించుకున్నారు.

ఇప్పుడు అనుకున్న తేదీ కంటే ముందుగానే రాధేశ్యామ్ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదే విష‌య‌మై యూవీ క్రియేష‌న్స్‌ను అమెజాన్ సంప్ర‌దిస్తే.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 2న రాధే శ్యామ్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న  రావాల్సి ఉంది.