ఇల్లా.. బంగార‌మా..

మ‌హిళ‌ల  ఛాయిస్ ఏంటి?

బంగారం అంటే ఇష్ట‌ప‌డ‌ని ఆడ‌వాళ్లు చాలా అరుదు. ఏమాత్రం వీలున్నా త‌మ‌కు ఇష్ట‌మైన న‌గ‌లు కొనేస్తుంటారు.

ప‌డుచుపిల్ల‌ల నుంచి మొద‌లు చిన్న పిల్ల‌లు, బామ్మ‌లు అంద‌రూ బంగారం అంటే ఇష్ట‌ప‌డుతారు.

ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌.. ఇప్పుడు ప‌రిస్థితులు మారుతున్నాయి. గోల్డ్‌ కంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మ‌హిళ‌ల ఇంట్రెస్ట్ పెరుగుతున్న‌ది.

బంగారం కంటే కూడా ఇండ్లు, ఫ్లాట్లు కొనేందుకు మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు నో బ్రోక‌ర్ సంస్థ స‌ర్వేలో వెల్ల‌డైంది.

ఢిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ముంబై, పుణె న‌గ‌రాల్లో 41 శాతం మ‌హిళ‌లు ఇండ్ల కొనుగోళ్ల‌కు మొగ్గుతున్నారు.

వీరిలో 50 శాతం మంది సిటీ ప‌రిధిలో, 9 శాతం మంది సొంత ప‌ట్ట‌ణాల్లో ఇండ్లు కొనుగోలుకు ప్రాధాన్య‌మిస్తున్నారు.

ఇక 94 శాతం మ‌హిళ‌లు సొంతింటి కోసం చూస్తుంటే.. 6 శాతం మాత్రం క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీకి మొగ్గు చూపుతున్నారు.

73%  మంది 40-75 ల‌క్ష‌ల్లోపు,  20%  మంది కోటి లోపు ,  7% మంది కోటి కంటే ఎక్కువ విలువ గ‌ల ఇండ్ల‌పై ఇన్వెస్ట్‌కు ప్రియార్టీ ఇస్తున్నారు.

బెంగ‌ళూరులో 63 శాతం మంది సిద్ధంగా ఉన్న ఇండ్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు.  37 శాతం నిర్మాణంలో ఉన్న ఇండ్ల‌వైపు మొగ్గుతున్నారు.