#Anasuya

ఇంట‌ర్‌లోనే అన‌సూయ ల‌వ్‌స్టోరీ

అన‌సూయ ప్రేమించిన వాడితో పెళ్లికి త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించేందుకు ఏళ్ల‌త‌ర‌బ‌డి పోరాడింద‌నే విష‌యం తెలుసా..

ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్‌లో అన‌సూయ NCC క్యాంప్‌కు వెళ్లింది. ఆ క్యాంప్‌కి అన‌సూయనే గ్రూప్‌ క‌మాండ‌ర్

Green Star

Anasuya

అదే క్యాంప్‌కు భ‌ర‌ద్వాజ్ వెళ్లాడు. అక్క‌డే అన‌సూయ‌ను తొలిసారిగా చూశాడు. తొలిచూపులోనే మ‌న‌సు పారేసుకున్నాడు.

Green Star

Anasuya

అనుకున్న‌దే త‌డ‌వుగా అన‌సూయ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన భ‌రద్వాజ్ మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ పెట్టాడంట‌. 

Green Star

Anasuya

భ‌ర‌ద్వాజ్ ప్ర‌పోజ‌ల్‌కు మొద‌ట షాకైనా.. అత‌ని ధైర్యానికి ఫిదా అయిందంట అన‌సూయ‌

Green Star

Anasuya

ఆ టైంలో మాట్లాడ‌కుండా అనూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

Anasuya

స‌రిగ్గా ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌ళ్లీ అదే  NCC క్యాంప్‌లో అన‌సూయ‌, భ‌ర‌ద్వాజ్ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు.

ఆ ప‌రిచయం స్నేహంగా.. కొంత‌కాలానికే స్నేహం.. ప్రేమ‌గా మారింది.

Green Star

Anasuya

భర‌ద్వాజ్‌తో ప్రేమ విష‌యాన్ని ముందుగా అన‌సూయ‌.. త‌న త‌ల్లికి చెప్పింద‌ట‌.

Green Star

Anasuya

కొన్నాళ్లు గ‌డిచాక అన‌సూయ‌కు ఆమె తండ్రి ఓ సంబంధం తీసుకొచ్చాడంట‌. కానీ ఆ సంబంధానికి అనూ ఒప్పుకోలేదు. 

Green Star

Anasuya

అలా అన‌సూయ‌ న‌చ్చ‌లేద‌ని చెప్పినా కొద్దీ వాళ్ల నాన్న రోజుకో సంబంధం తీసుకొచ్చేవాడంట‌.

Green Star

Anasuya

వేరే వ్య‌క్తిని చేసుకోవ‌డం ఇష్టం లేక భ‌ర‌ద్వాజ్‌నే పెళ్లి చేసుకుంటాన‌ని త‌న తండ్రికి అన‌సూయ గ‌ట్టిగా చెప్పేసింది.

Green Star

Anasuya

వాళ్ల నాన్న భ‌ర‌ద్వాజ్‌తో పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కొచ్చిన అన‌సూయ.. కొన్నాళ్లు హాస్ట‌ల్‌లో ఉంది. 

కొద్ది రోజుల త‌ర్వాత ఇంట్లోకి రానిచ్చినా భ‌ర‌ద్వాజ్‌తో పెళ్లికి ఆమె తండ్రి స‌సేమిరా ఒప్పుకోలేదు. దీంతో అన‌సూయ చాలా కాలం పాటు ఆయ‌న‌తో మాట్లాడ‌లేదంట‌.

Green Star

Anasuya

చేసుకుంటే  భ‌ర‌ద్వాజ్‌నే చేసుకుంటా త‌ప్ప ఇంకా ఎవ‌ర్నీ చేసుకోన‌ని అన‌సూయ మొండిప‌ట్టు ప‌ట్టందంట‌.

Anasuya Bharadwaj

కొంత‌కాలం పాటు ఓపిక ప‌ట్టిన వాళ్ల నాన్న‌.. చేసేదేమీ లేక భ‌ర‌ద్వాజ్‌తో పెళ్లికి ఒప్పుకున్నాడంట‌.

Green Star

Anasuya

అలా ఇరు కుటుంబాల అంగీకారంతో 2010 ఫిబ్ర‌వ‌రి 10న త‌ను ప్రేమించిన భ‌ర‌ద్వాజ్‌ను అన‌సూయ పెళ్లి చేసుకుంది.

www.ntnews.com