pawan kalyan

పవన్‌ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం : అలీ

Comedian Ali

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, కమెడియన్‌ అలీ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని అలీ ప్రకటించాడు.

ఏపీ సీఎం జగన్‌ ఆదేశిస్తే ఎవరిపైన అయినా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశాడు.

పవన్‌ కళ్యాణ్‌ తను మిత్రుడే అయినప్పటికీ.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని కమెడియన్‌ అలీ స్పష్టం చేశారు.

2019 ఎన్నికల ముందు టీడీపీని వీడిన అలీ.. వైసీపీలో చేరాడు. దీంతో పవన్‌, అలీ మధ్య విబేధాలు ఉన్నట్టు తొలిసారిగా వార్తలు వచ్చాయి.

అప్పట్నుంచి పవన్‌, అలీ మధ్య గ్యాప్‌ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల అలీ కూతురి పెళ్లికి పవన్‌ రాకపోవడం కూడా వైరల్‌గా మారింది.

అయితే పవన్‌కి రావడం కుదరలేదని, ఫోన్‌ చేసి విష్‌ చేశాడని అలీ చెప్పాడు. తమ మధ్య గ్యాప్‌ రాలేదని అలీ స్పష్టం చేశాడు.

ఇప్పుడు ఏకంగా పవన్‌పైనే పోటీకి సిద్ధమని అలీ చెప్పడంతో వీళ్ల మధ్య గొడవలు ఇంకా తగ్గలేదని అంతా అనుకుంటున్నారు.