beauty tips

మెడ చుట్టూ ముడతలా.. ఇలా తగ్గించుకోండి

ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి కీడు చేసే ఫ్రీరాడికల్స్‌ నుంచి ఇవి కాపాడుతాయి.

ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెను, టేబుల్‌ స్పూన్‌ స్వచ్ఛమైన తేనె, కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి మెడ మీద మర్దన చేసుకుంటే ముడతలు రావు.

అరటిపండ్లలో విటమిన్లు, మినరల్స్‌, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువ. అవి చర్మం పునఃసృష్టిని, కొలాజెన్‌ ఉత్పత్తిని పెంపొందిస్తాయి. 

బాగా పండిన అరటిపండును పేస్టుగా చేసుకోవాలి. దానిని ముడతల ప్రాంతంలో సుతారంగా రాయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బాదం గింజలు తిన్నా, ముడతలు పడిన ప్రాంతంలో పేస్టులా రాసుకున్నా మంచి ఫలితాలు ఖాయం.

ఫైబర్‌, ఐరన్‌, కాల్షియం, ఫోలిక్‌ ఆమ్లం, ఓలెయిక్‌ ఆమ్లం అధికంగా ఉన్న బాదం గింజలు ముడతలను నివారిస్తాయి.

తేనెలోని విటమిన్ బీ, పొటాషియం చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తాయి. 

తేనె పలుచటి పొరలా మెడ చుట్టూ రుద్దుకోవాలి. చర్మం బిగుతుగా మారేదాకా ఉంచుకుని చల్లటి నీటితో కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ రుద్దుకోవాలి.