సురేఖవాణి సినిమాలు ఎందుకు చేయ‌ట్లేదు?

ఈ మ‌ధ్య‌కాలంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

త‌న కూతురు సుప్రిత‌తో క‌లిసి చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సురేఖ‌వాణి.. కొత్త సినిమాలు మాత్రం ఒప్పుకోవ‌డం లేదు.

దీంతో సురేఖవాణి సినిమాల‌కు గుడ్‌బై చెప్పింద‌ని కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

సినిమాలు మానేస్తోంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై సురేఖ‌వాణి తాజాగా స్పందించింది.

స్వాతిముత్యం స‌క్సెస్‌మీట్‌లో మాట్లాడిన సురేఖ.. కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవ‌డం లేదో క్లారిటీ ఇచ్చింది.

కొద్ది రోజులుగా తాను సినిమాలు మానేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. కానీ వాటిల్లో నిజం లేదని సురేఖ వాణి స్ప‌ష్టం చేసింది.

త‌న ద‌గ్గరి వ‌ర‌కు ఆఫ‌ర్లు వ‌స్తేనే క‌దా న‌టించేందుకు ఒప్పుకునేద‌ని చెబుతూ వాపోయింది.

అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలియ‌ట్లేద‌ని సురేఖ వాణి చెప్పుకొచ్చింది.

తాను సినిమా అమ్మాయి అని.. సినిమానే త‌న జీవిత‌మ‌ని చెబుతూనే.. ఆఫ‌ర్లు వ‌స్తే సినిమాల్లో త‌ప్ప‌కుండా న‌టిస్తానని స్ప‌ష్టం చేసింది.