అలా నేనెప్పుడు చెప్పా? మీకిష్టం వచ్చింది రాస్తారా?

తమిళంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియా భవానీ శంకర్‌ తాజాగా తెలుగులోకి కూడా అడుగుపెట్టింది.

White Lightning
White Lightning

సంక్రాంతి కానుకగా వచ్చిన కల్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

White Lightning

ప్రస్తుతం తెలుగులో కూడా బిజీ అవ్వాలని చూస్తున్న ప్రియా భవానీ గురించి మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది.

ఎక్కువ డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లోకి వచ్చానని ప్రియా భవానీ చెప్పినట్టుగా ఓ ఆంగ్ల మీడియాలో తాజాగా ప్రచురితమైంది.

White Lightning

తనపై వచ్చిన తప్పుడు వార్తలపై నటి ప్రియా భవానీ శంకర్‌ అగ్రహం వ్యక్తం చేశారు.

ఆ కథనంపై స్పందించిన ప్రియా భవానీ శంకర్‌.. ఏ ఆధారాలతో ఈ వార్తను రాశారో తెలుసుకోవచ్చా అని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించింది.

White Lightning
White Lightning

తనెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. పేరొందిన వెబ్‌సైట్స్‌లో ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకవేళ డబ్బు కోసమే సినిమాల్లోకి వస్తే తప్పేముంది? అందరూ డబ్బుల కోసమే పనిచేస్తారు కదా అని అడిగింది.

నటీనటులు మాత్ర అలాంటి వ్యాఖ్యలు చేస్తే చీప్‌గా ఎందుకు చూస్తారని ప్రశ్నించింది.

ఒకరిని ఇలా తక్కువ చేసిన కథనాలు రాయడం తగదని సూచించింది.