మోడ‌ల్ అంటే అందంగానే ఉండాలా?

ఊబకాయం, బొల్లి మచ్చలు, డౌన్‌ సిండ్రోమ్‌.. సవా లక్ష సమస్యలు ఉండవచ్చు. అయితేనేం, క్యాట్‌వాక్‌లు మేమూ చేయగలమని అంటున్నారు కొత్తతరం మోడళ్లు.

వీళ్ల ప్రభావంతోనే అందాల లోకానికి కమ్మిన పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆ ఉత్సాహానికి కార్పొరేట్ల ప్రోత్సాహమూ తోడవుతున్నది.

Sofia jiruw

ఫ్యాషన్‌ ప్రపంచంలోనే ‘విక్టోరియా సీక్రెట్‌’ ఓ తిరుగులేని బ్రాండ్‌. అంతపెద్ద కంపెనీ ప్యూర్టోరికోకు చెందిన డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలు సోఫియా జిరౌను మోడల్‌గా ఎంపిక చేసుకుంది. 

Ellie goldstein

బ్రిటిష్‌ మోడల్‌ ఎల్లీ గోల్డ్‌స్టెయిన్‌ కూడా డౌన్స్‌ సిండ్రోమ్‌ బాధితురాలే. గూచీ బ్యూటీ క్యాంపెయిన్‌లో వైకల్యం ఉన్న మొదటి మోడల్‌గా ప్రపంచ ఖ్యాతి పొందింది. 

varshitha tatavarthi

విశాఖకు చెందిన వర్షిత తటవర్తి ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌లో హవా కొనసాగిస్తున్నది. డిజైనింగ్‌ కంపెనీ సబ్యసాచి మోడల్‌గా గుర్తింపు తెచ్చు కున్నది. 

19 ఏండ్ల భారతీయ మోడల్‌ ప్రణవ్‌ బక్షి.. ఆటిజం ఉన్న మొట్టమొదటి పురుష మోడల్‌గా చరిత్ర సృష్టించాడు.

pranav bakhshi

Winne Harlow

జమైకన్‌- కెనడియన్‌ ఫ్యాషన్‌ మోడల్‌ విన్నీ హార్లోకు చిన్ననాటి నుంచే బొల్లి వ్యాధి. అయినా, నిండైన ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తూ.. తానేమిటో నిరూపించుకున్నది.

Evening

నల్లజాతీయురాలైన ప్రీషియస్‌ లీ ప్రపంచంలోనే మొట్టమొదటి ‘బ్లాక్‌ ప్లస్‌ సైజ్‌ మోడల్‌’. లావుగా ఉన్నా ర్యాంప్‌లను షేక్‌ చేస్తున్నది.