రామాయ‌ణంలోని  ఈ పాత్ర‌ల గురించి తెలుసా

రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి. వాల్మీకిని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. వాల్మీకంలో 24 వేల శ్లోకాలు 7 కాండాలుగా ఉన్నాయి. 4.8 లక్షల పదాలు ఉన్నాయి.

వాల్మీకి మహర్షి

విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు ఏడవ అవతారం. శ్రీరాముణ్ని చూసి నేర్చుకోవాల్సిన లక్షణం.. స్థితప్రజ్ఞత. సంతోషానికి పొంగిపోకుండా, బాధకు కుంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు.

శ్రీరామచంద్రుడు

ఆదిశేషుడి అవతారం లక్ష్మణుడు. మరో పేరు సౌమిత్రి (సుమిత్ర కొడుకు). దశరథుడి ఇంట్లో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. బాల్యం నుంచీ రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు.

లక్ష్మణుడు

భారతీయులకు హనుమంతుడు ఆరాధనీయుడు. ‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కారాల కలయికే.. ‘హనుమ’ అనీ, హనుమనామం ప్రణవ స్వరూపమనీ పేర్కొంటారు. హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు, శివాంశ సంభూతుడు.

హనుమంతుడు

రామాయణంలో శ్రీరాముడి భక్తురాలు శబరి. రాముని దర్శనం కోసం జీవితాంతం భక్తితో వేచి ఉండి, చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.

శబరి

మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. లోక కల్యాణం కోసం స్వామివారితోపాటు అమ్మవారు కూడా. రామాయణంలో సీతగా, మహాభారతంలో రుక్మిణిగా, కలియుగంలో పద్మావతిగా వివిధ అవతరాలను ఎత్తింది.

సీతాదేవి

రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు. శ్రీరాముడి భక్తుడు. గుహుని పరిచయం అయోధ్యకాండ 50వ సర్గతో మొదలవుతుంది. చివరగా, గుహుడి ప్రస్తావన రావణ వధానంతరం యుద్ధకాండ చివర్లో 128వ సర్గలో కనిపిస్తుంది.

గుహుడు

శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. కేకసి, విశ్రావసు కుమార్తె. రావణ, కుంభకర్ణ, విభీషణ, ఖర, దూషణులకు సోదరి. మారీచుడు, సుబాహులకు మేనకోడలు. అంటే.. తాటకి ఈమెకు అమ్మమ్మ.

శూర్పణఖ

రావణుడు… వేదవేదాంగాలను ఆపోశన పట్టిన మహాపండితుడు. నిత్య పూజా దురంధరుడు. తపస్వి, గొప్ప రాజనీతిజ్ఞుడు. సంగీత సాహిత్యాలలోనూ ప్రతిభావంతుడు.. ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ, అతని పతనానికి ప్రధాన కారణం మాత్రం.. ‘పరస్త్రీ వ్యామోహం’.

రావణాసురుడు

మేఘనాదుడు

రావణాసురుడు-మండోదరి దంపతుల పెద్ద కొడుకు. జన్మించినప్పుడు అరిచిన అరుపు, మేఘం ఉరిమిన పిడుగు శబ్దంలా ఉండటం వల్ల ‘మేఘనాదుడు’ అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని జయించినందున ‘ఇంద్రజిత్తు’ అయ్యాడు

జటాయువు అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గద్ద). ఇతను అనూరుడు (సూర్యభగవానుడి రథసారథి), శ్యేని కుమారుడు. సంపాతి ఇతని సోదరుడు. దశరథుడి స్నేహితుడు. రావణుడు సీతమ్మను అపహరించుకొని వెళ్తున్నప్పుడు నిలువరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. 

జటాయువు

శ్రీరాముడు, సీతకు కలిగిన కవల పిల్లల్లో లవుడు మొదటివాడు. అతని సోదరుడు కుశుడు. లవుడు తల్లిలా గోధుమ వర్ణంలో ఉంటే, కుశుడు తండ్రిలా శ్యామ వర్ణంలో ఉంటాడు

లవుడు-కుశుడు

మయుడు రాక్షసుల రాజు. ఇతనికి మయాసురుడు అని కూడా పేరు. లంకాధిపతి అయిన రావణుని భార్య మండోదరి.. మయుని కుమార్తె. అంటే, మయుడు రావణబ్రహ్మకు మామ అవుతాడు. 

మయుడు

భూదేవి సీత తల్లి. బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాల ప్రకారం నరకాసురుడు భూదేవి కొడుకు. నవగ్రహాలలో ఒకడైన అంగారకుడు కూడా భూదేవి కొడుకే. ఈమె సీతకు తల్లి మాత్రమే కాకుండా.. విష్ణువు అవతారమైన వరాహస్వామి భార్య, లక్ష్మీదేవికి మరో రూపంగానూ భావిస్తారు.

భూదేవి

శక్తిమంతుడైన రాక్షస యోధుడు ప్రహస్తుడు.. రావణుని సేనాధిపతి. మహాభారతంలో పురోచనుడిగా దుర్యోధనుని నమ్మకమైన సహాయకుడిగా, లాక్షా గృహ సంఘటనకు కారణమైనవాడిగా పునర్జన్మ పొందాడు.

ప్రహస్తుడు

సుగ్రీవునితోపాటు పరిచయం అవుతాడు. సుగ్రీవునితో యుద్ధంలో.. రామబాణానికి కూలిపోతాడు

నలుడు విశ్వకర్మ కుమారుడు. రామసేతువును నిర్మించాడు. నీలుడు అగ్ని కుమారుడు.వానర సైన్యానికి నాయకుడు. రామరావణ యుద్ధంలో ఇద్దరిదీ కీలక పాత్రే.

వాలి

నలుడు-నీలుడు