మాళవికకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన నయన్‌

మలయాళ నటి మాళవిక మోహనన్‌కు లేడీ సూపర్ స్టార్‌ నయనతార స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది.

White Lightning
White Lightning

తను దర్శకుల నటిని అని.. సినిమాకు అనుగుణంగా వాళ్లు ఏం చెబితే అదే చేస్తానని నయన్ పేర్కొంది.

White Lightning
Orange Lightning

డ్రెస్సింగ్, మేకప్‌, హావభావాలు ఇలా ప్రతి విషయం వాళ్లు చెప్పినట్టే ఫాలో అవుతానని స్పష్టం చేసింది.

గతంలో  ఓ హీరోయిన్‌ తన డ్రెస్సింగ్‌, మేకప్‌ గురించి కామెంట్స్‌ చేసిందని నయనతార గుర్తుచేసింది.

White Lightning

రియలిస్టిక్‌, కమర్షియల్‌ సినిమాలకు వ్యత్యాసం ఉంటుందన్న విషయాన్ని ఆమె గుర్తుపెట్టుకోవాలని నయన్‌ చురకలంటించింది.

రియలిస్టిక్‌ సినిమాల్లో లుక్‌ పరంగా జాగ్రత్త అవసరం.. కానీ కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్స్‌ను స్టైలిష్‌గానే చూపిస్తారని కౌంటర్‌ వేసింది.

White Lightning
White Lightning

కాగా, నయన్‌ చేసిన వ్యాఖ్యలు నటి మాళవికా మోహనన్‌ గురించేనని స్పష్టంగా తెలుస్తోంది.

గతంలో మాళవిక మాట్లాడుతూ.. ఓ హీరోయిన్‌ ఆస్పత్రి సీన్‌లో కూడా ఫుల్‌ మేకప్‌ వేసుకుని నటించిందని చెప్పింది.

ఆ సీన్‌ చూసి షాకయ్యానని.. కమర్షియల్‌ సినిమా అయినా కాస్త వాస్తవికంగా ఉండేలా తీయొచ్చు కదా అంటూ సూచించింది.

మాళవిక మోహనన్‌ చేసిన ఈ వ్యాఖ్యల మీదనే నయనతార కౌంటర్‌ వేసిందని ఇప్పుడు టాక్‌ నడుస్తోంది.