నిర్మాతల కష్టాలు తెలిసొచ్చినట్టు ఉన్నయ్‌

Nayanthara

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఎప్పుడూ సినిమాల ప్రమోషన్‌లో పాల్గొనదు.

గతంలో మీడియాలో వచ్చిన వార్తలకు బాధపడి మీడియా ముందుకు రావొద్దని నిర్ణయించుకున్నా అని నయన్‌ చెప్పింది.

అందుకే లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అయినా కూడా నయన్‌ ప్రమోషన్‌కు ససేమిరా అంటూనే ఉంటుంది.

దీంతో నయన్‌పై పలువురు నిర్మాతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా నయన్‌ తీరు మారలేదు.

తాజాగా నయన్‌ నటించిన కనెక్ట్‌ సినిమాకు మాత్రం ఆమె వరుసగా ప్రమోషన్‌లో పాల్గొంటున్నది. ఇంటర్వ్యూలు ఇస్తున్నది.

దీనికి కారణం కనెక్ట్‌ సినిమాకు నయన్‌ నిర్మాత. విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించింది. 

తమ సొంత సినిమా కాబట్టే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నదనే విమర్శలు వస్తున్నాయి.

నిర్మాతల కష్టాలు ఇప్పుడు తెలిసొచ్చినట్టు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.