జుట్టు రాలిపోతుందా? ఈ చిట్కాలు మీకోసమే

Hair fall Solutions

జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా.. కింది చిట్కాలతో వాటికి చెక్ పెట్టేయండి.

గుడ్డులోని తెల్లసొన, కలబంద గుజ్జు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో జుట్టు మొత్తానికి పట్టించాలి.

50 నిమిషాల తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. తర్వాత కండీషనర్ అప్లై చేయడం వల్ల జుట్టురాలడం తగ్గుతుంది.

మెంతులను బాగా నానబెట్టి పేస్టులా చేయాలి. అందులో కొంచెం హెన్నా, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మిశ్రమంలా తయారుచేయాలి.

ఈ పేస్టును కుదుళ్ల నుంచి మొత్తం జుట్టుకు పట్టించాలి. రెండు గంటల తరువాత నీటితో తలస్నానం చేయాలి. తరుచూ ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గుడ్డు తెల్లసొన, అరటిగుజ్జు, ఆలివ్ ఆయిల్ వేసి మిశ్రమంలా చేయాలి. ఈ పేస్టును జుట్టుకు పట్టించాలి.

20 నిమిషాల తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.