ఉల్లిగడ్డతో జుట్టు ఒత్తుగా వస్తుందా?

Onions for Hair growth

ఉల్లిగడ్డ ఆరోగ్యానికే కాదు సౌందర్యానికీ ఉపయోగపడుతుంది.  ఉల్లితో అందాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిగడ్డల్లో అధిక శాతం సల్ఫర్‌ ఉంటుంది. సల్ఫర్‌ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తినిస్తుంది.

ఉల్లిగడ్డను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఉల్లిగడ్డ పేస్ట్‌ను తలకు పట్టించడానికి అరగంట ముందు హాట్‌ ఆయిల్‌ మసాజ్‌ చేయాలి.

ఉల్లిగడ్డ రసం తలలోని ఇతర ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ మీ కేశాలను డ్యామేజ్‌ చేయవచ్చు.

జుట్టు రాలడానికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌  ముఖ్య కారణం కావచ్చు.  కాబట్టి స్లాప్‌ ఇన్‌ఫెక్షన్‌ అరికట్టడానికి ఉల్లిగడ్డ రసం ఉపయోగిస్తే మంచిది.

ఉల్లిగడ్డ రసాన్ని తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది.

ఉల్లిగడ్డలో ఉండే సల్ఫర్‌ హెయిర్‌ ఫాల్‌ను అరికట్టడమే కాదు.. హెయిర్‌ గ్రోత్‌కు కూడా సహాయపడుతుంది.

ఉల్లిగడ్డ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకుని బాగా మిక్స్‌ చేసి మాడుకు మసాజ్‌ చేయాలి. అలా చేసిన అరగంట తర్వాత షాంపూ పెట్టుకుని చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

ఉల్లిగడ్డ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది.