పచ్చళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

మనం ఇష్టంగా చేసుకునే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి..

పచ్చళ్ల నిల్వకు ఉపయోగించే డబ్బాను ముందుగా వేడినీళ్లతో శుభ్రంగా కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఏమాత్రం చెమ్మలేకుండా చూసుకున్నాకే.. అందులోకి పచ్చడి మార్చాలి. 

గాలి చొరబడని ఎయిర్‌టైట్‌ కంటెయినర్లను ఎంచుకుంటే మేలు. అందులోనూ గాజు, పింగాణి, మట్టిపాత్రలలో చాలా రోజులు తాజాగా ఉంటాయి.

పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచే శక్తి ఉన్న నూనె, వెనిగర్‌లాంటి వాటిని తయారీ సమయంలోనే దండిగా వేయండి. లేదంటే, పచ్చడి త్వరగా పాడవుతుంది.

ఉడికించి చేసే పచ్చళ్ల విషయానికి వస్తే.. వేడి తగ్గాకే జాడీలు, డబ్బాల్లోకి మార్చండి. వేడి మీద మూతపెడితే ఆవిరి పట్టి పాడవుతాయి. అలాగే, కాస్త ఎండపొడ తగిలేచోట ఉంచితే మేలు.

ఒకవేళ కొన్ని రోజులకు పచ్చడి పొడిపొడిగా అనిపిస్తే, వేడి చేసిన ఆవనూనె పోసి కలిపితే సరి!