winter

చలికాలంలో ఈ ఫుడ్‌ తీసుకుంటే అనారోగ్యం పరార్‌

health tips

జలుబు చేసినప్పుడు చికెన్‌ సూప్‌ తాగితే ముక్కుదిబ్బడ వదులుతుంది. ఇందులో క్యాలరీలు, కాల్షియం, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తొందరగా శక్తిని అందిస్తాయి.

బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ నుంచి కాపాడే గుణం వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లి రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.

జలుబు, ఫ్లూ ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడివేడి చాయ్‌ తాగితే రిలీఫ్‌ వస్తుంది. సైనసైటిస్‌ సమస్యతో బాధపడేవారిలో అధిక మ్యూకస్‌ తొలగిపోతుంది.

టీలోని పాలీఫినాల్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. బ్లాక్‌ టీ శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.

అరటిపండ్లు త్వరితంగా శక్తినిస్తాయి. ఇందులో శక్తినిచ్చే క్యాలరీలతోపాటు పోషకాలూ అత్యధికం. వాంతులు, విరేచనాలు తదితర సమస్యను తగ్గిస్తాయి.

చారులో క్యాలరీలతోపాటు విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, ఫోలేట్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌ వల్ల ఎముకలు త్వరగా గట్టిపడి బలహీనత నుంచి బయట పడతారు.

జబ్బు పడినవాళ్లు త్వరగా కోలుకోవడానికి తేనె ఉపకరిస్తుంది. తేనె హానికర బ్యాక్టీరియాను, ప్రాణాంతక సూక్ష్మజీవులను అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది.

గొంతు సమస్యలు ఉన్నవారు రోజూ ఓ టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకుంటే సమస్య మటుమాయం ఖాయం.

ఓట్స్‌లో ఉండే క్యాలరీలు, విటమిన్లు, ఖనిజాలు ఇమ్యూనిటీ పెంచుతాయి. వాపుల్ని తగ్గిస్తాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థితికి తెస్తాయి.

పెరుగులో క్యాలరీలు, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలం. పెరుగులోని మంచి బ్యాక్టీరియా వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. జబ్బున పడ్డవాళ్లు వేగంగా కోలుకుంటారు.

పండ్లలో క్యాలరీలతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ. పండ్లు, పండ్లరసాలు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది.

పండ్లలో వ్యాధి నిరోధకతను పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ ఉంటాయి.