డైరెక్షన్‌ చేస్తానంటున్న అనుపమ పరమేశ్వరన్‌

నిఖిల్‌తో కలిసి అనుపమ నటించిన 18 పేజిస్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.

White Lightning
White Lightning

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అనుపమ.. ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

White Lightning
Orange Lightning

రంగస్థలం సినిమాలో ఛాన్స్‌ మిస్సవ్వడంతో చాలా బాధపడ్డానని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చింది.

అప్పుడు ఛాన్స్‌ పోయిన ఇప్పుడు సుకుమార్ రాసిన కథలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపింది.

White Lightning

చాలామంది దర్శకత్వం ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారని.. త్వరలోనే డైరెక్షన్‌ చేస్తానని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు అయిపోగానే.. ఏడాదిపాటు విరామం తీసుకుంటామని చెప్పింది.

White Lightning
White Lightning

ఆ టైమ్‌లో డైరెక్టర్ల వద్ద టెక్నికల్‌ అంశాలు నేర్చుకుంటానని.. ఆ తర్వాత డైరెక్షన్‌ చేస్తానని తెలిపింది.

గ్యాప్‌ దొరికినప్పుడల్లా కథలు రాస్తున్నానని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చింది.

తన డైరెక్షన్‌లో మాత్రం తను నటించనని అనుపమ పరమేశ్వరన్‌ స్పష్టం చేసింది.