Aishwarya lekshmi

ప్రేమలో పడ్డ ఐశ్వర్య లక్ష్మీ.. నిజమేనా?

విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ.

White Lightning
White Lightning

పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తీ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈమె దగ్గరైంది.

White Lightning

తాజాగా మట్టి కుస్తీతో హిట్ కొట్టిన ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. 

White Lightning

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడినట్టు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

White Lightning

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నటుడు అర్జున్‌ దాస్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ రెడ్‌ హార్ట్‌ సింబల్‌ జోడించింది.

ఇది చూసిన తర్వాతనే ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో పడిందనే వార్తలు పుట్టుకొచ్చాయి.

White Lightning

ఈ పోస్టుపై ప్రియాంక జువాల్కర్‌ కూడా స్పందించింది. సో హ్యాపీ అంటూ కామెంట్‌ చేసింది.

కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది కొత్త సినిమా ప్రమోషన్‌ అయ్యి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు.

నిజంగా ఇది ప్రేమనా? కొత్త సినిమా ప్రమోషనా? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.