యాక్టింగ్‌ మానేయడంపై సాయిపల్లవి క్లారిటీ

సాయిపల్లవి సినిమాలు మానేస్తుందనే వార్త కొంతకాలంగా ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

సినిమాలు మానేసి తన చెల్లెతో కలిసి త్వరలోనే ఓ ఆస్పత్రి ఓపెన్‌ చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది.

విరాటపర్వం, గార్గి తర్వాత సాయిపల్లవి సినిమాలు ఒప్పుకోకపోవడంతో అంతా ఇదే నిజమేనని అనుకున్నారు.

ఈ గాసిప్స్‌పై  తాజాగా సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది.

తాను మెడిసిన్‌ చదివినప్పటికీ సినిమాల్లోకి రావాలనే ఉండేదని.. దీనికి వాళ్ల అమ్మానాన్న కూడా సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొంది.

ప్రేమమ్‌ లాంటి సినిమాతో కెరీర్‌ మొదలైందని.. అందులోని టీచర్‌ ఇమేజ్‌ చెరిపివేసేందుకు విభిన్న పాత్రల్లో నటించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది.

మంచి స్క్రిప్టులు వస్తే భాషతో సంబంధం లేకుండా నటిస్తానని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది.