KTR | జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో రుజువైంది : కేటీఆర్‌

KTR | జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.