Munipalli | మునిపల్లి ఎంపీడీవో అవినీతి బాగోతం.. పంచాయతీల తనిఖీల పేరుతో అడ్డగోలుగా పైసా వసూల్‌

Munipalli | సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో హరినందన్‌రావు మండలంలోని గ్రామాల్లో ఏదో పేరుతో నిత్యం తనిఖీ చేస్తుంటాడు. ప్రతి గ్రామంలో తనిఖీ చేయడం వరకు బాగానే ఉంది. కానీ అందులోనే అసలు మర్మం ఉంది. ఎంపీడీవో తనిఖీ చేసి వెళ్లేప్పుడు సంబంధిత గ్రామాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డ్రైవర్‌కు ఫోన్‌ పే లేదా గూగుల్‌ పేలో డబ్బులు పంపించాల్సిందే.