e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిందగీ రోబో-జోజో.. ఫ్రెండ్స్‌!

రోబో-జోజో.. ఫ్రెండ్స్‌!

రోబో-జోజో.. ఫ్రెండ్స్‌!


కుక్క, పిల్లి, కుందేలు వంటి పెంపుడు జంతువులను కుటుంబసభ్యుల్లా ప్రేమిస్తూ, వాటి యోగక్షేమాల కోసం పరితపించేవారు కోకొల్లలు. మరీ ముఖ్యంగా, అంగవైకల్యం ఉన్న పెంపుడు జంతువుల బాగోగుల కోసం కొత్తకొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతున్నది యువత. క్రమంగా ఆ మూగజీవాలు రోబోలతో స్నేహం చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మిళింద్‌ రాజ్‌ రోబోటిక్స్‌ నిపుణుడు. లాక్‌డౌన్‌లో లక్నో నగరాన్ని శానిటైజ్‌ చేసేందుకు డ్రోన్స్‌ని ఉపయోగించాడు. అప్పుడే, అతనికి ఒక కుక్కపిల్ల స్పృహ లేకుండా కనిపించింది. దగ్గర్లో దవాఖానలు లేకపోయేసరికి ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేశాడు. దానికి ‘జోజో’ అని పేరు పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన రెండ్రోజులకు ఆ కుక్కపిల్లకు చూపు లేదని అర్థమైంది. ఎంతో బాధపడ్డాడు. నాటినుంచీ మరింత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. జోజోకు కావాల్సిన ఆహారాన్ని అందించడానికి ఒక రోబోను తయారు చేశాడు. బిస్కెట్లనుంచి పాలవరకూ అన్నీ ఆ రోబోనే అందిస్తుంది. ఇప్పుడు, రోబో-జోజో మంచి ఫ్రెండ్స్‌!
వీల్‌చైర్ల తయారీ
‘మింట్‌బౌల్‌’ బ్రాండ్‌తో కుక్కలకు వీల్‌చైర్లు తయారు చేసే కంపెనీని స్థాపించాడు వెబ్‌ డిజైనర్‌ భూమిత్‌ వ్యాస్‌. ఆయనకూ కుక్కలంటే ప్రేమ. అనేకానేక కారణాలతో నడవలేకపోతున్న కుక్కలకోసం ప్రత్యేకంగా వీల్‌ చైర్లు తయారు చేసే కంపెనీలు అమెరికాలో చాలా ఉన్నాయి. ఒక్కో చక్రాల కుర్చీ ధర రూ.36 వేల నుంచి రూ.60 వేల దాకా ఉంటుంది. దీనివల్ల, అంగవైకల్యం కలిగిన జంతువులను పెంచుకోవడానికి చాలామంది వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. అందుకే వ్యాస్‌, ఏకంగా ఓ కంపెనీని పెట్టి ఒక్కో వీల్‌ చైర్‌ను, రెండు నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోబో-జోజో.. ఫ్రెండ్స్‌!

ట్రెండింగ్‌

Advertisement