e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిందగీ నారి మేనిపై..నార నగలు!

నారి మేనిపై..నార నగలు!

నారి మేనిపై..నార నగలు!

పూర్వం రుషులు, మునులు నారవస్ర్తాలు ధరించేవారని పురాణాల్లో చదివాం. కాలక్రమంలో మరుగున పడిన నార, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల పుణ్యమాని ఆధునిక ఫ్యాబ్రిక్‌ రూపంలో అలరిస్తున్నది. తాజాగా ఆభరణంగానూ మారుతున్నది. కొత్తదనాన్ని కోరుకుంటున్న అతివలు జూట్‌ జువెలరీకి స్వాగతం పలుకుతున్నారు.

ఆభరణాలంటే బంగారం, వెండి, ప్లాటినం నగలే అనుకుంటాం, వజ్ర వైఢూర్యాల ధగధగలే అని భావిస్తాం. కాలంతోపాటు నగల నిగనిగలూ మారిపోయాయి. అందంగా ఉంటూ ఆకర్షించేవన్నీ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌గా మారిపోతున్నాయి. ఆ కోవకే చెందుతుంది జూట్‌. పర్యావరణ హితమైన నారతో తయారైన వస్తువులు, దుస్తులు చాలాకాలం నుంచీ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. హ్యాండ్‌ బ్యాగులు మొదలు పాదరక్షల వరకు వివిధ రూపాల్లో అలరిస్తున్న నార ఇప్పుడు ఆభరణాల రూపు దాల్చి నారీమణులను అకర్షిస్తున్నది.

రకరకాల డిజైన్లలో..

నారి మేనిపై..నార నగలు!
- Advertisement -

జూట్‌ నగలు ముత్యాలు పొదుగుకొని మెరిసి పోతున్నాయి. పూసలు, చంకీలు, కుందన్లతో కొంగొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. రకరకాల రంగులద్దుకొని సరికొత్తగా తయారవుతున్నాయి. వినూత్న డిజైన్లలో లోహాలతో చేసే ఆభరణాలకు దీటుగా నిలబడుతున్నాయి. తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్న జూట్‌ నగలు సామాన్యులకు వరంగా, కలిగిన వారికి ఫ్యాషన్‌గా మారాయి.

మ్యాచింగ్‌.. మ్యాచింగ్‌

నారి మేనిపై..నార నగలు!

కూరగాయల నార, అరటినారతో తయారైన జూట్‌ ఫ్యాబ్రిక్‌తో నేసిన చీరలపై నారనగలు భలేగా సెట్‌ అవుతాయి. హారాలు, బ్రేస్‌లెట్స్‌, పెండెంట్స్‌ వంటి ఎన్నో రకాల నగలు దుస్తులపై అందంగా అమరిపోతున్నాయి. నార దారాలకు జతగా బంగారం, వెండి రంగుల్లో తళుకులీనే పూసలు, రాళ్లను జత చేర్చడంతో అసలైన నగలకు ఏ మాత్రం తీసిపోవడం లేదంటే అతిశయోక్తికాదు. నార చీరపైకి అదే జూట్‌తో తయారైన ఆభరణాలు, పాదరక్షలు, బ్యాగు కాంబినేషన్‌గా ధరిస్తే ఇంతకన్నా మ్యాచింగ్‌ ఏముంటుంది చెప్పండి.

ఏ మాత్రం తీసిపోకుండా..

నారి మేనిపై..నార నగలు!

ఆభరణాల్లో జూట్‌ ప్రవేశం ఒక సంచలనం. నయా ఫ్యాషన్‌ నగలుగా చలామణి అవుతున్న పట్టు, సిల్క్‌, ఫ్యాబ్రిక్‌ నగలకు దీటుగా నయా హంగులతో అలరిస్తుండటంతో ఈ నార ఆభరణాలవైపు మగువలు మొగ్గు చూపుతున్నారు. పండుగలు, పెండ్లిళ్లకు ధరించే సంప్రదాయ వస్త్రాలపైనే కాకుండా ట్రెండీ దుస్తులపైనా ఇవి బాగా నప్పుతాయి. రంగురంగుల పూసలు, బీడ్స్‌ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన ఈ స్పెషల్‌ జువెలరీ సాధారణ నగలకు భిన్నంగా కొత్తలుక్‌ని ఇస్తున్నాయి.

పెండెంట్‌ ప్రత్యేకం

నారి మేనిపై..నార నగలు!

పొడవైన హారాల్లో భారీ పెండెంట్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. జూట్‌ దారాల రంగులకు నప్పే విధంగా బంగారం, ఇతర లోహాలతో చేసిన పెద్ద పెద్ద పెండెంట్లు ఈ హారాలకు మరింత అందాన్నిస్తాయి. పెండెంట్‌లోకి వజ్రాలుగానీ, ముత్యాలుగానీ, ఒకే రకానికి చెందిన రాళ్ళుగానీ పొదిగితే ట్రెండీగా కనిపిస్తాయి. హారం సైజుకి సరిపోయేలా పెండెంట్‌ పరిమాణం, డిజైన్‌ ఎంచుకోవాలి.అప్పుడే జూట్‌ నగలు బాగా సూటవుతాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నారి మేనిపై..నార నగలు!
నారి మేనిపై..నార నగలు!
నారి మేనిపై..నార నగలు!

ట్రెండింగ్‌

Advertisement