కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు(పావ్‌లు): నాలుగు, చికెన్ (బోన్‌లెస్): 200 గ్రా., చీజ్ తురుము: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, టమాట: ఒకటి, పెరుగు: అర కప్పు, కారం, ధనియాలపొడి: ఒక టీస్పూన్ చొప్పున, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నూనె: ఒక టేబుల్ స్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, చాట్ మసాలా: ఒక టీస్పూన్, నిమ్మరసం/వెనిగర్: ఒక టీస్పూన్.
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను సన్నని పొడవైన ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో చికెన్, పసుపు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, పెరుగు వేసి కలిపి అరగంటపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక, తరిగిన టమాట ముక్కలు జోడించాలి. చక్కగా మగ్గిన తర్వాత నానబెట్టిన చికెన్ వేసి సన్నని మంటపై మూతపెట్టి ఉడికించాలి. చికెన్ ఉడికిపోయాక.. చాట్ మసాలా, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలగలిపి దించేయాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి వెన్న వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి.. కొద్దిగా కారం, కొత్తిమీర తురుము చిలకరించి దించెయ్యాలి. బ్రెడ్ పావ్లను మధ్యకు కట్‌చేసి ఉడికించిన చికెన్‌ను పరిచి పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము వేయాలి. స్టవ్‌మీద పెనం పెట్టి, వెన్న మిశ్రమం వేసి పావ్లను పెట్టి పైనుంచి కూడా వెన్న వేసి.. సన్నని మంటపై కాల్చుకుంటే చికెన్ చీజ్ పావ్ సిద్ధం.