రుచిలో మేటి కొబ్బరి. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కొబ్బరికి లేదు సాటి. అయితే, కొబ్బరి కొట్టి, కాయను తురిమి చిప్పను పడేయకుండా అందులోనే వంటకాలు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి చిప్పలో వండే పదార్థాలు సరికొత్త రుచిని సంతరించుకుంటాయని అంటున్నారు. కొబ్బరిచిప్పలో ఆహార పదార్థాలు వండటం కష్టమే! కనీసం సలాడ్స్, పండ్ల రసాలు, వండిన ఆహార పదార్థాలు అందులో ఉంచి కాసేపయ్యాక తినాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కొబ్బరిచిప్పలోని ఫైబర్ కంటెంట్‌ను అందులో ఉంచిన ఆహారం శోషించుకుంటుందని, ఫలితంగా పోషకాలు పెరుగుతాయని సెలవిస్తున్నారు. ఇలా కొబ్బరిచిప్పల్లో తయారు చేసుకున్న వంటకాలు ఆరగించడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.