ఫ్యాషన్ బ్లాగర్, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆంత్రప్రెన్యూర్ మసూమ్ మీనావాలా మెహతాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పదిలక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆమె పెట్టే పోస్ట్‌లు మహిళా సాధికారతకు తోడ్పడేలా ఉంటాయి. ప్రజల్లో చేనేతపై అవగాహన కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తున్నదామె. మహిళలు సొంతంగా చేనేత వస్ర్తాలతో వ్యాపారం చేసేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తూ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది తను. “నాకు మొదటి నుంచీ ఫ్యాషన్ స్టార్టప్స్‌పై ఆసక్తి ఎక్కువ. చేనేత వ్యాపారం మొదలుపెట్టాలనుకునే మహిళలకు ఉపయోగపడే సూచనలు ఇవ్వడానికి ‘ఎంపహెర్’ అనే ప్రాజెక్ట్‌కు నాంది పలికాను’ అంటున్నది మీనావాలా. సీఎన్ఎన్ చానల్ విడుదల చేసిన ‘20 ఇన్ 40’ జాబితాలో తన పేరూ ఉంది.