e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ మాకూ ఆకాశమే హద్దు

మాకూ ఆకాశమే హద్దు

మాకూ ఆకాశమే హద్దు

‘జీరో సైజు’ కోసం నానా తంటాలు పడుతుంటారు కొందరు మహిళలు. కాస్త బొద్దుగా ఉండే ఆడవారిని ఏదో రకంగా హేళన చేయడం మరికొందరికి పరిపాటిగా మారింది. ప్లస్‌ టూ సైజులో కాస్త బొద్దుగా ఉండే హైదరాబాద్‌కు చెందిన ప్రార్థనా అగర్వాల్‌కు ఈ అవమానాలు కొత్తేమీ కాదు. పలువురు ఆమె శరీర తీరుపై రకరకాల కామెంట్లు చేసేవారు. ఈ ఈసడింపులకు ప్రార్థన కుంగిపోలేదు. వాటిని తిప్పికొట్టాలని భావించింది. అందుకు సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకుంది. మొదట్లో డబ్‌స్మాష్‌ వీడియోలతో పాపులర్‌ అయిన ప్రార్థన తర్వాత పలు మేకప్‌ ట్రాన్సిషన్‌ వీడియోలను షేర్‌ చేసింది. ప్రత్యేక వీడియోల ద్వారా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ని పెంచుకుంది 19 ఏండ్ల ప్రార్థన. అంతేకాదు, ప్లస్‌ టూ సైజులో ఉండే అమ్మాయిలకోసం తన స్నేహితురాలు దివ్య జోషితో కలిసి ‘పెహ్నావా’ అనే ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌నికూడా స్టార్ట్‌ చేసింది. ‘నా ఆత్మస్థయిర్యానికి, ధైర్యానికి కారణం మా అమ్మ. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని అమ్మ నిలిచిన తీరు నాకు ఆదర్శం. సోషల్‌ మీడియా వేదికగా నా వాయిస్‌ వినిపించాలనుకున్నా. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోవర్స్‌ నాకు కుటుంబంతో సమానం. ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నారు. ప్లస్‌ టూ సైజులో ఉండే ఆడవాళ్లకు ఫ్యాషన్‌ దుస్తులు దొరకడం చాలా కష్టం. అందుకే ‘పెహ్నావా’ను ప్రారంభించాం. ముందుముందు మరిన్ని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పుకొచ్చింది ప్రార్థన.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాకూ ఆకాశమే హద్దు

ట్రెండింగ్‌

Advertisement