శ్రావణం అంటేనే పండుగలు, పూజలు, వ్రతాలు! మగువలంతా సంప్రదాయ పట్టు దుస్తుల్లో మెరిసిపోతారు. పట్టు చీరల్లో కంచిపట్టు ఓ మెట్టు పైనే ఉంటుంది. మహిళల మనసుదోచే చేనేత కంచిపట్టు చీరల డిజైన్లేమిటో చూద్దాం.
పచ్చని చిలుకలా..
ప్యారెట్ గ్రీన్, పింక్.. పట్టుచీరల్లో ఎవర్గ్రీన్ కాంబినేషన్. చిలుక పచ్చ చీరకు పింక్ బార్డర్‌తో డిజైన్ చేసిన చీర ఇది. ఈ చీరకు గోల్డ్, సిల్వర్ జరీతో పది ఇంచుల లాంగ్ బార్డర్ ఇచ్చారు. ప్లెయిన్ గోల్డ్ బార్డర్పైన సిల్వర్ లైన్లు, పింక్ ఫినిషింగ్ ఇచ్చారు. చీరంతా లైన్లు, రౌండ్ బుటాలతో హైలైట్ చేశారు. చీరకు నప్పేలా పింక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ క్లాసిక్ లుక్ ఇస్తున్నది.
పింక్ అండ్ పీచ్
పీచ్ అండ్ పింక్ సెల్ఫ్ కాంబినేషన్లో డిజైన్ చేసిన చీర ఇది. చీరంతా సిల్వర్ జరీతో బుటాస్ వర్క్ చేశారు. గోల్డ్, సిల్వర్ కాంబినేషన్లో పింక్ లైన్లతో ఇచ్చిన లాంగ్ బార్డర్ హైలైట్ అయ్యింది.
డార్క్ పింక్ బార్డర్
బాటమ్తో ఇచ్చిన పల్ల్లూపై, గ్రీన్ కలర్ బుటాస్ వర్క్ స్పెషల్ లుక్ ఇస్తున్నది. బార్డర్ పింక్లైన్కు నప్పేలా డార్క్ పింక్ కలర్ బ్లౌజ్‌పై ఒకవైపు షోల్డర్‌కు మగ్గం వర్క్ చేశారు. రెండు ఇంచుల ప్లిట్స్తో ట్రెండీగా కనిపిస్తున్నది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335