తాజాగా ‘తేనెటీగల పుప్పొడి’ సూపర్ ఫుడ్స్ జాబితాలో చేరింది. పూలనుంచి తేనెటీగలు సేకరించే పుప్పొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. పుప్పొడిలో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, లిపిడ్స్తోపాటు దాదాపు 250 క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఈమధ్యకాలంలో చాలామంది దీన్ని రోజువారీ డైట్లో చేర్చుతున్నారు. వీటిలో సుమారు 40 శాతం కార్బొహైడ్రేట్స్, 35 శాతం ప్రొటీన్, 4-10 శాతం నీరు, 5 శాతం ఫ్యాట్ ఉంటాయి. తేనెటీగ పుప్పొడి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతాయి. కండరాలకు దృఢత్వాన్ని ఇస్తాయి. నిద్రలేమిని, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లు రాకుండా పుప్పొడి నివారిస్తుంది.