మహిళల ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో ట్రెండ్ హల్చల్ చేస్తుంది. ఇప్పుడు, హెడ్‌బ్యాండ్స్ వంతు. అప్పట్లో చిన్నపిల్లలకే ఈ బ్యాండ్స్ పెట్టేవాళ్లు. ప్రస్తుతం అమ్మాయిలూ దర్జాగా ధరిస్తున్నారు. అందులో ఎన్నో వెరైటీలు.
హవాయన్ హాలీడే : హవాయి ైస్టెల్ హెడ్బ్యాండ్లలోనూ వివిధ రకాలు. ముఖ్యంగా అందులో పఫ్ఫీ ైస్టెల్ హెడ్‌బ్యాండ్ మరీ ఆకర్షణీయం. ఇందులో మింట్, సాల్మన్, టాంజెరిన్ షైన్ రంగులకు డిమాండ్ ఉంది.
లెదర్ లవ్ : కొందరికి లెదర్ వస్తువులంటే ఇష్టం. హ్యాండ్‌బ్యాగ్ నుంచి రిస్ట్ వాచీ వరకు అన్నిటికీ ప్యూర్ లెదర్నే ఎంచుకుంటారు. అలాంటివాళ్లకు ఈ లెదర్ హెడ్‌బ్యాండ్ నచ్చుతుంది. మార్కెట్లో స్టడెడ్ లెదర్ హెడ్‌బ్యాండ్‌కు గిరాకీ ఉంది. వందశాతం బ్లాక్ లెదర్, గోల్డ్ స్టడ్స్ కాంబినేషన్‌తో అందంగా తయారు చేస్తున్నారు.
ఫెదర్ లైట్ : ‘మినిమలిస్టిక్’ ఆలోచన కలిగిన వాళ్లకు ఈరకం హెడ్‌బ్యాండ్ బాగా నచ్చుతుంది. సన్నని మెటల్ బ్యాండ్‌కు సాఫ్ట్ పౌడర్ బ్లూ ఈకలు అమర్చడం వల్ల తలపై ఈ బ్యాండ్ హైలైట్‌గా నిలుస్తుంది.
క్రిస్టల్ క్లియర్ : కొందరికి ఏదైనా సరే, ధగధగా మెరుస్తూ ఉండాలి. అలాంటివాళ్లకు క్రిస్టల్ హెడ్‌బ్యాండ్ నచ్చుతుంది. బంగారు పూత ఇత్తడి బ్యాండ్‌కు తళతళా మెరిసే రకరకాల క్రిస్టల్స్‌ని అమర్చుతారు. ఈ బ్యాండ్ నైట్ పార్టీలకు సూటవుతుంది.
రచ్డ్ రొమాన్స్ : ఈ బ్యాండ్ ైస్టెలిష్‌గా ఉండటమే కాదు, దీని మెటీరియల్ చిక్కుచిక్కుగా ఉన్న జుట్టును మృదువుగా మారుస్తుంది.
ఫుల్ ఆఫ్ రోజెస్ : గులాబీలను ఇష్టపడని మహిళలు ఉంటారా? అందుకే అన్నిరకాల ఫ్యాషన్ వస్తువులకూ గులాబీని జోడిస్తారు. అలాగే, హెడ్బ్యాండ్లలో రోజ్ ఫ్లవర్ ైస్టెల్ బ్యాండ్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తుంది. ముదురు ఎరుపు రంగుల్లోని పూల ఆకారాలు, మధ్యమధ్యలో అమర్చిన క్రిస్టల్స్ దీని ప్రత్యేకత.