లేడీ మెకానిక్!

మహిళలు ఎందులోనూ తక్కువకాదు. ఏదైనా సాధించగలరు. ఎంతటి కష్టమైనా చేయగలరని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. వారి స్ఫూర్తితోనే మెకానిక్ వృత్తిని ఎంచుకున్నది విశాఖ యువతి రేవతి. ఆటోమొబైల్ రంగంలో ఆడవాళ్ళు చాలామందే ఉన్నా మెకానిక్‌లుగా రాణిస్తున్నవారు మాత్రం చాలా తక్కువే. దీనికి కారణం మెకానిక్ అంటే మగవాడే అనే భావన జనాల్లో బాగా పాతుకు పోవడమే. అయితే వాటన్నిటినీ పక్కన పెడుతూ మొండి బండ్లను కూడా దారికి తెస్తున్నది రేవతి.
రేవతి తండ్రి రాము ఇరవై ఏండ్లుగా మెకానిక్‌గా చేస్తున్నారు. తండ్రి పనిని గమనిస్తూ పెరిగిన రేవతికి బైక్‌లు, కార్ల రిపేర్‌పై ఆసక్తి పెరిగింది. హైస్కూల్ రోజుల్లోనే సాయంకాలాలు షెడ్డుకెళ్ళి తండ్రికి సాయంగా ఉంటూ, పంక్చర్లు వేయడం నేర్చుకుంది. రానురాను సొంతంగా రిపేరు చేయడం మొదలు పెట్టింది. తొలినాళ్లలో చాలామంది ‘ఆడపిల్లకి ఇదేం పని’ అంటూ ఎగతాళి చేసేవారు. తన వల్ల అవుతుందో లేదో అని అనుమానపడేవారు. కానీ రేవతి ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా మెకానిక్ రేవతి దగ్గరే రిపేర్లు చేయించుకుంటామని అంటున్నారు. ఫోన్ చేస్తే ఇంటికెళ్ళి కూడా రిపేర్లు చేస్తుందీ యువతి. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి పెండ్లి చేశాను. చిన్నమ్మాయి రోజూ షెడ్డుకి వచ్చి రిపేర్లు చేయడం నేర్పమని అడుగుతుండేది. కూతురిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నేర్పించా. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడారు. అయినా, నేను పట్టించుకోలేదు. ఆడపిల్ల అయినంత మాత్రాన మెకానిక్‌గా పని చేయకూడదని ఏం లేదు కదా? ఇప్పుడు, తనే సొంతంగా అన్ని రకాల రిపేర్లూ చేస్తుంది’ అని చెబుతున్నారు రేవతి తండ్రి రాము. ‘నాన్నను మించిన మెకానిక్ కావడమే నా లక్ష్యం’ అంటున్నది లేడీ మెకానిక్ రేవతి.
తాజావార్తలు
- 65 ఏళ్లు దాటిన వారికి కోవీషీల్డ్.. ఆమోదించిన ఫ్రాన్స్
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్‌సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్