శనివారం 23 జనవరి 2021
Zindagi - Dec 04, 2020 , 00:21:50

వార్తల్లో మహిళ.. అనితా ఆనంద్‌

వార్తల్లో మహిళ.. అనితా ఆనంద్‌

భారత స్వతంత్ర పోరాటాన్ని మలుపుతిప్పిన సంఘటనల్లో జలియన్‌వాలా బాగ్‌ ఊచకోత ఒకటి. 1919లో జనరల్‌ డయ్యర్‌ దాష్టీకానికి దాదాపు 360 మంది బలయ్యారు. ఈ దమనకాండ ఇతివృత్తంగా బ్రిటిష్‌ ఇండియన్‌ జర్నలిస్ట్‌, రచయిత్రి అనితా ఆనంద్‌ రాసిన ‘ద పేషంట్‌ అసాసిన్‌- ఎ ట్రూ టేల్‌ ఆఫ్‌ మాసకెర్‌' పుస్తకానికి అరుదైన పురస్కారం లభించింది. యూకేకు చెందిన పెన్‌ హెసిల్‌-టిల్ట్‌మన్‌ ప్రైజ్‌కు ఈ రచన ఎంపికైంది. ఏడుగురు రచయితలు పోటీపడగా, అంతిమంగా అనిత అవార్డును గెలుచుకున్నారు. జలియన్‌ వాలాబాగ్‌ దురాగతం, తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆమె దీనిని రచించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎందరి ప్రాణాలనో బలిగొన్న ఓ బ్రిటిష్‌ అధికారిపై ఓ బాధితుడు ఎలా పగ తీర్చుకున్నాడన్నది ప్రధాన ఇతివృత్తం. పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ.. ‘అరుదైన చారిత్రక నవల’గా ఈ రచనను అభివర్ణించింది.logo