శనివారం 04 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:07:47

నాటకంలో స్త్రీ వేషం ధరించి..

నాటకంలో స్త్రీ వేషం ధరించి..

పీవీ రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, సాహిత్య ప్రియుడేకాదు. నాటక ప్రియుడు కూడా. బాల్యంలో వీధి భాగవతాలంటే చిన్నతనంలో చెవికోసుకునేవారు.  నాటకాలంటే ప్రాణం. వాటిలో లీనమై పోయేవారు. ఎంతలా అంటే ఒకసారి లంకా దహనంలో ఆంజనేయుడు లంకా దహన దృశ్యం చూసి ఆయన ఎంతో ఉత్తేజితుడయ్యాడు. అంతే ఆ భాగవతం అయిపోయిన తరువాత  ఒక దూడ పలుపును తోకగా ధరించి, దానికి నిప్పుపెట్టి  ఇంటి వెనక ఉన్న పూరిపాకకు తగిలించేసరికి ఊరంతా అదికాస్తా భగ్గుమంది. ఊరంతా గగ్గోలు. అలాగే మిత్రులతో కలిసి నాటకాలను కూడా వేసేవారు. ఆకర్షణీయంగా డైలాగులను చెప్పేవారు. ఒకానొక సందర్భంలో ఆయన నాటకంలో స్త్రీ పాత్రను ధరించి చక్కగా పాడి, ఆడి ప్రశంసలు పొందారు. తన డైలాగులేకాక, ఇతర పాత్రలకు సంబంధించిన డైలాగులు కూడా ఆయన కంఠోపాఠంగా చెప్పేవారు. తక్కిన పాత్రలకు ఆయన ప్రాంప్టింగ్‌ చేసేవారు.logo